మౌలానా వహీదుద్దీన్ ఖాన్
మౌలానా వహీదుద్దీన్ ఖాన్ | |
జననం: | 1 జనవరి 1925 |
---|---|
వృత్తి: | ఇస్లామీయ ఆధ్యాత్మిక నాయకుడు, వక్త, రచయిత |
శైలి: | ఇస్లామీయ సాహిత్యం, |
వెబ్‌సైటు: | http://www.wkhan.net/ |
మౌలానా వహీదుద్దీన్ ఖాన్ (ఆంగ్లం : Maulana Wahiduddin Khan), సాధారణంగా ఇతను "ప్రపంచానికి ఇస్లామీయ ఆధ్యాత్మిక దౌత్యవేత్త" అని గుర్తింపబడుతాడు.[1] ఇతడు అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామీయ ఆధ్యాత్మిక గురువుగానూ, ఇస్లాం శాంతివచనాల దౌత్యవేత్తగాను, ప్రపంచశాంతిని కోరే శాంతిదూతగానూ పరిగణింపబడుతాడు.[2] ఇతడి ఉపన్యాసాలు ప్రపంచంలో పలుచోట్ల జరుగుతూనేవుంటాయి. ఉపన్యాసకుడిగా, రచయితగా, విశ్లేషకుడిగా అపార అనుభవము గలదు. అనేకసార్లు, భారతప్రభుత్వమూ ఇతడి సలహాలను కోరుతూ వుంటుంది. 2021 లో భారత ప్రభుత్వం దేశ రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అందజేసింది.[3]
అల్ రిసాలా ఉద్యమం
[మార్చు]ఇతను "అల్ రిసాలా" అనే పత్రికను స్థాపించి, ఇస్లామీయ ఆధ్యాత్మిక విధానాన్ని, ప్రపంచానికి తెలియజెప్పే కార్యక్రమానికి భుజాన వేసుకున్నాడు.[4]
ఇతని మిషన్
[మార్చు]ఇతని మిషన్ "పీస్ మిషన్" లేదా "శాంతి ఉద్యమం" అని పిలువబడుతుంది.
ఇతని దృక్కోణం
[మార్చు]మౌలానా వహీదుద్దీన్ ఖాన్ శాంతియుత ప్రపంచాన్ని కోరుకునేవారిలో ఒకడు. ప్రపంచపు నలుమూలలా, ప్రతి ఇంటిలోనూ ఆధ్యాత్మిక శాంతి నెలకొల్పాలనే ఆశయం. అందుకే ప్రపంచమంతటా తిరుగుతూ శాంతిని బోధిస్తూ, ఇస్లామీయ ధార్మిక ప్రచారం చేపట్టాడు.
అందరితో శాంతి
[మార్చు]ఇస్లాం ఒక సంపూర్ణ శాంతిమార్గము, ఆధ్యాత్మిక మార్గమనీ ప్రచారం చేయడము, అన్ని మతాలపట్ల సమాన గౌరవాభిమానాలను ప్రకటించడము. “ధనాత్మకమైన ప్రకృతిని పొందాలంటే కేవలం శాంతిద్వారా మాత్రమే పొందగలమని, ఇతని ప్రగాఢ విశ్వాసం. ఈ విషయం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమలు పరచాలని అభిలషిస్తాడు".
“సమస్యలను మరచిపోండి, అవకాశాలను సద్వినియోగపరచుకోండి.”
నిజమైన జిహాద్ శాంతిని సాధించడమే.[5] [6].
బాబ్రీ మస్జిద్ వివాద సందర్భంగా ఇతని వకాల్తా
[మార్చు]బాబ్రీమస్జిద్ కూల్చివేత జరిగిన సమయంలో 1992లో మౌలానా, ప్రజలకు శాంతి పిలుపునిచ్చాడు. పరస్పర అవగాహనా సదస్సులలో పాల్గొన్నాడు. శాంతిని నెలకొల్పుటకు 15 రోజుల శాంతియాత్రను చేపట్టాడు.
ఖురాన్ తర్జుమాలు
[మార్చు]ఖురాన్ యొక్క తర్జుమా, ఉపన్యాసాల ఆవశ్యకతలను దృష్టిలో వుంచుకొని మౌలానా, ఖురాన్, హదీసు సంకలనాలను ఉర్దూ భాషలో రచించాడు. దీనిని 1983లో "తజ్‌కిరుల్ ఖురాన్" అనే పేరుతో ముద్రించారు. ఇటీవలి కాలంలో హిందీ, అరబ్బీ భాషలలోనూ ముద్రించారు.
రచనలు
[మార్చు]మౌలానా వహీదుద్దీన్ ఖాన్ దాదాపు 200 పుస్తకాలు, గ్రంథాలు రచించాడు. వాటిలో కొన్ని;
- ది ఖురాన్ (ఆంగ్లంలో ఖురాన్ తర్జుమా, కామెంటరీతో సహా)
- గాడ్ అరైజెస్
- ఐడియాలజీ ఆఫ్ పీస్
- ముహమ్మద్: ద ప్రాఫెట్ ఫార్ ఆల్ హ్యుమానిటీ
- మోరల్ విజన్
- సింపుల్ విజ్‌డం
- ఇంట్రడ్యూసింగ్ ఇస్లాం
- ద కాల్ ఆఫ్ ది ఖురాన్
- ట్రూ జిహాద్
- మ్యాన్ నో దైసెల్ఫ్
- ఇస్లాం రిడిస్కవర్డ్
- యాన్ ఇస్లామిక్ ట్రెజరీ ఆఫ్ వర్చ్యూస్
- ఇస్లాం: క్రియేటర్ ఆఫ్ ది మాడర్న్ ఏజ్
- ఇండియన్ ముస్లిమ్స్: నీడ్ ఫార్ అ పాజిటివ్ ఔట్‌లుక్
- అల్-ఇస్లాం యతహద్ద
- తజ్‌కిరుల్ ఖురాన్
- పైగంబర్-ఎ-ఇంకిలాబ్
అవార్డులు, పురస్కారాలు
[మార్చు]- డెమిర్గస్ శాంతి అంతర్జాతీయ అవార్డు, సోవియట్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ పేట్రొనేజ్ లో.
- పద్మభూషణ్ పురస్కారం
- జాతీయ సమైక్యతా అవార్డు
- కమ్యూనల్ హార్మొనీ అవార్డు
- ద దివాలిబెన్ మోహన్‌లాల్ మెహతా అవార్డు. రాష్ట్రపతిచే ప్రదానం చేయబడింది.
- నేషనల్ అమిటీ అవార్డు, భారతప్రధానిచే ప్రదానం చేయబడింది.
- ఢిల్లీ గౌరవ్ అవార్డు, ఢిల్లీ ముఖ్యమంత్రిచే ప్రదానం చేయబడింది.
- FIE ఫౌండేషన్ అవార్డు
- ఉర్దూ అకాడెమీ అవార్డు
- అరుణా అసఫ్ అలీ సద్భావనా అవార్డు
- నేషనల్ సిటిజన్స్ అవార్డు (మదర్ థెరెసా చే ప్రదానం చేయబడినది)
- సీరత్ ఇంటర్నేషనల్ అవార్డు
ఇతరములు
[మార్చు]అనేక విశ్వవిద్యాలయ విద్యార్థులు ఇతనిపై పరిశోధనలు చేశారు. ఉదాహరణకు, మదనపల్లె పట్టణానికి చెందిన మొహియుద్దీన్ బాషా, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయపు విద్యార్థి, మౌలానా వహీదుద్దీన్ ఖాన్ యొక్క సాహితీసేవలపై పి.హెచ్.డి. చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ Maulana Wahiduddin Khan Archived 2008-12-30 at the Wayback Machine, CPS Television.
- ↑ In January 2000. Tamara Sonn & Mary Williamsburg, (2004), A Brief History of Islam, Blackwell. ISBN 1-4051-0902-5.
- ↑ "పద్మ అవార్డు గ్రహీతలు 2021". భారత ప్రభుత్వం.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Analysis of the writings of Maulana Wahiduddin Khan By Yoginder Sikand". Retrieved 2008-07-20.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-07-15. Retrieved 2012-07-15.
- ↑ http://islampeaceandjustice.blogspot.com/2008/10/maulana-wahiduddin-khan-ijtihad-freedom.html[permanent dead link]
గ్రంధాలు
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- CS1 maint: url-status
- All articles with dead external links
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- భారతదేశంలో ఇస్లాం
- ముస్లిం తత్వవేత్తలు
- ఇస్లాం హిందూ మతాల మధ్య సంబంధాలు
- ముస్లిం పండితులు
- ఉత్తర ప్రదేశ్ రచయితలు
- 1925 జననాలు
- ఖురాన్ అనువాదకులు
- ఆధ్యాత్మిక గురువులు
- ముస్లిం ప్రముఖులు
- పద్మభూషణ పురస్కార గ్రహీతలు
- పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు